యాపిల్ ఫోన్లలో నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్య!

by Disha Web Desk 17 |
యాపిల్ ఫోన్లలో నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్య!
X

దిశ, టెక్నాలజీ: దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీ యాపిల్ ఇటీవల కొత్త అప్‌డేట్ వెర్షన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అప్‌డేట్ ద్వారా యూజర్లు నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. యాపిల్ తాజాగా కొత్త వెర్షన్ iOS 17.2.1 ఇటీవల విడుదల చేసింది. దీంతో బ్యాటరీ హీటింగ్, డ్రైయిన్ సమస్యను పరిష్కరించింది. కానీ దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్న వారికి మరో సమస్య వచ్చింది. అదేంటంటే యూజర్లు సెల్యులార్ నెట్‌వర్క్ ప్రొవైడర్‌కి కనెక్ట్ కావడంలేదు. ఇదే సమస్య చాలా మంది యూజర్లకు వచ్చినట్లు PhoneArena నివేదిక పేర్కొంది.

ఒక యూజర్ పేర్కొన్న దాని ప్రకారం, రాత్రి iPhoneని 17.2.1కి అప్‌డేట్ చేసిన తరువాత మొబైల్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ కావడం లేదు. చాలా సార్లు రీసెట్ చేసి ప్రయత్నించినప్పటికి కూడా అది పనిచేయలేదని, ఈ నెట్‌వర్క్ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక ఇబ్బందులు పడ్డట్టు చెప్పారు. అదే నివేదిక ప్రకారం, నెట్‌వర్క్ సమస్య పరిష్కారానికి యాపిల్ త్వరలో 17.2.2 లేదా 17.3 అప్‌డేట్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం సెల్యులార్ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్న యూజర్లు iOS 17.3 పబ్లిక్ బీటా ఇన్‌స్టాల్ చేస్తే తాత్కాలికంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.


Next Story