Asianet News TeluguAsianet News Telugu

#Devil వీకెండ్ కలెక్షన్స్ ...ఇలా ఉన్నాయేంటి?

ఇయర్ ఎండింగ్ వీకెండ్‌లో థియేటర్లలో సందడి చేయడానికి ‘డెవిల్’ వచ్చింది. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీకి ..

Nandamuri Kalyan Ram  #Devil Movie weekend Collections jsp
Author
First Published Jan 2, 2024, 6:51 AM IST


నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’. అభిషేక్ నామా దర్శక, నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, మాళవిక నాయర్ ముఖ్య పాత్రలో కనిపించింది. డెవిల్ మొన్న శుక్రవారం ( డిసెంబర్ 29న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న డెవిల్  అనుకున్న స్దాయిలో కలెక్షన్స్ సాధించటం లేదనే చెప్పాలి. డెవిల్ కి పాజిటివ్ టాక్ వచ్చిందని చిత్రయూనిట్ ఆల్రెడీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.  ట్రేడ్ కూడా డెవిల్ కి మెల్లిగా  కలెక్షన్స్ పెరుగుతాయని భావించింది. మొదటి మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే కష్టమనిస్తోంది.

👉నైజాం: 1.88Cr 
👉సీడెడ్: 88L
👉ఉత్తరాంధ్ర : 50L
👉ఈస్ట్ గోదావరి: 39L
👉వెస్ట్ గోదావరి: 24L
👉గుంటూరు: 38L
👉కృష్ణా : 25L
👉నెల్లూరు: 18L
ఆంధ్రా - తెలంగాణా మొత్తం:- 4.70CR(9.15CR Gross)
👉కర్ణాటక+ భారత్ లో మిగతా ప్రాంతాలు – 50L
👉ఓవర్ సీస్ – 75L 
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ – 5.95CR(12.10CR Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్,  న్యూ ఇయిర్ రోజు  కలెక్షన్స్ బాగానే వస్తాయనుకుంటే సలార్ తన్నుకుపోయిందంటోంది ట్రేడ్. రిపోర్ట్ రావాల్సి ఉంది.

ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.... నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో దాదాపు రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మొత్తంగా రూ.16.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది ‘డెవిల్’. తెలుగు రాష్ట్రాల మినహా ఇతర రాష్ట్రాల్లో రూ.1.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. ఓవర్సీస్‌లో రూ.2 కోట్ల బిజినెస్ జరిగింది. అలా మొత్తంగా ‘డెవిల్’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.20.10 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది.  డెవిల్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. డెవిల్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కళ్యాణ్ రామ్ చెప్పిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios