పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటగా సలార్.. సీజ్ ఫైర్ తో మొదటి పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాం. ఎప్పటినుండో ప్రభాస్ ను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ నే అందించాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తుంది సలార్ పార్ట్ 2 కోసం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సలార్ గురించి అలానే తన అప్ కమింగ్ మూవీస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు. సలార్ పార్ట్ 2 కథ సిద్దంగానే ఉంది.. త్వరలోనే ఈసినిమాను మొదలుపెడతాం.. నాకు తెలుసు ఫ్యాన్స్ ఈసినిమా రిలీజ్ కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తారో.. వీలైనంత తొందరగానే ఈసినిమాను రిలీజ్ చేయడానికి చూస్తామని తెలిపాడు.
నాగోల్ ఒక్కటే నావర్క్ తో వీలైనంత మందిని ఎంటర్ టైన్ చేయాలి.. నేను సినిమాలు సెలక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే. కల్కి సినిమా ఫ్యూచరిస్ట్ గా ఉంటుంది.. సలార్ ఫుల్ రగ్డ్ మాస్ సినిమా మరొకటి హార్రర్ మూవీ ఇలా డిఫరెంట్ జోనర్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయాలి..సలార్ సినిమాపై చూపించిన ప్రేమనే ఈసినిమాలపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నాని తెలిపారు.
Rebel star #Prabhas opens up about the reason behind his choice of films in an interview.#Salaar #Kalki2898AD #PrabhasMaruthi #TeluguFilmNagar pic.twitter.com/Q25JwxSxH6
— Telugu FilmNagar (@telugufilmnagar) January 3, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: