నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు జగన్ నిర్ణయం

నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటుకు జగన్ నిర్ణయం

CM Jagan

మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న వేళ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, సి.రామచంద్రయ్యపై పిర్యాదు చేసింది. మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు లేఖ అందించారు.

ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఓట్లు వేసిన విషయం తెలిసిందే. వారిని ఇప్పటికే పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ ఇటీవలే జనసేన పార్టీలో చేరారు.

ఇక, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఇటీవలే చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన సి.రామచంద్రయ్య ఆ పార్టీలో చేరాక మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారని చెప్పారు. ఏమి చేసినా జగన్ చేసిన అప్పులు తీరవని అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి జగన్‌కు చెప్పినా వినే పరిస్థితి లేదని విమర్శలు గుప్పించారు.

Also Read: MLA Jonnalagadda Padmavathi : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సెన్సేషనల్ కామెంట్స్