RGVకి మరో బిగ్ షాక్.. ‘వ్యూహం’ విడుదల లేనట్లేనా..?

by Disha Web Desk 4 |
RGVకి మరో బిగ్ షాక్.. ‘వ్యూహం’ విడుదల లేనట్లేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ చిత్రానికి మరో షాక్ తగిలింది. విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది. ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియాలో ‘వ్యూహం’ చిత్రం విడుదలపై స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది. థియేటర్లలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ విడుదలపై సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది.

ఇక, వ్యూహం సినిమా విడుదలను శుక్రవారం తెలంగాణ హై కోర్టు బ్రేక్ వేసింది. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌కు అనుకూలంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా ‘వ్యూహం’ ఉందంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినిమాకు బ్రేక్ పడటంతో వర్మ ఏం చేయబోతున్నరనేది ఆసక్తిగా మారింది.


Next Story

Most Viewed