అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

by Disha Web Desk 15 |
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
X

దిశ, కామారెడ్డి : అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్లో పాత అంతర్ జిల్లా నేరస్తుడు సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన అందోల్ నవీన్ (28) గత నెల 31న కామారెడ్డి ఇంటర్నేషనల్ హోటల్ పక్కన ఉన్న మహాలక్ష్మి టైల్స్ షాప్ లోకి రాత్రిపూట చొరబడి షాపులో ఉన్న 40 వేల నగదును దొంగిలించాడన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాత నేరస్తులపై నిఘా పెట్టి ఈ కేసును

ఛేదించడానికి రెండు టీములను ఏర్పాటు చేసి ఆ దొంగతనాన్ని అందోల్ నవీన్ చేసినట్టుగా గుర్తించి గురువారం అతన్ని పట్టుకొని విచారణ చేసినట్లు తెలిపారు. ఈ నేరంతో పాటు ములుగు జిల్లా మేడారం గ్రామంలో ఈనెల 16న కూడా ఒక కొబ్బరికాయల దుకాణంలో దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడన్నారు. ఇతని వద్ద నుండి ఒక మోటార్ సైకిల్, లక్షా 96 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కేసులను కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది, సీసీఎస్ కామారెడ్డి సిబ్బంది కలిసి ఛేదించారని, ఈ సందర్భంగా వీరిని అభినందిస్తున్నట్లు సీఐ తెలిపారు.


Next Story

Most Viewed