భారత్‌-రష్యా ఎగుమతుల్లో ఆల్‌టైం రికార్డు

ABN , First Publish Date - 2023-04-29T02:07:16+05:30 IST

భారత్‌-రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పుంజుకుంది.

భారత్‌-రష్యా ఎగుమతుల్లో  ఆల్‌టైం రికార్డు

2022-23లో 4,160 కోట్ల డాలర్లకు చేరిక

నాలుగు రెట్లకు పైగా పెరిగిన క్రూడ్‌ ఎగుమతులు

న్యూఢిల్లీ: భారత్‌-రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పుంజుకుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2022 -23)లో భారత్‌కు రష్యా ఎగుమతులు 4,160 కోట్ల డాలర్లకు పెరిగాయి. రష్యా వార్షిక ఎగుమతులు 4,000 కోట్ల డాలర్లు మించడం ఇదే తొలిసారి. అంతేకాదు, సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి ఇది. రష్యా నుంచి భారత్‌కు ముడిచమురు ఎగుమతులు భారీగా పెరగడమే ఇందుకు కారణం. 2021-22తో పోలిస్తే 2022-23లో రష్యా నుంచి భారత్‌కు ముడిచమురు ఎగుమతులు నాలుగు రెట్లకు పైగా పెరిగాయి. తద్వారా భారత్‌కు రష్యా ఐదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదిగింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి రష్యాకు 280 కోట్ల డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతయ్యాయి. దాంతో రెండు దేశాల మధ్య జరిగిన మొత్తం వాణిజ్యం 4,440 కోట్ల డాలర్లకు పెరిగింది. సాధారణంగా మన దేశం రష్యా నుంచి ముడిచమురు, పప్పులు, వంటనూనెలు, మసాలాలు, ఆల్కహాల్‌ బెవరేజెస్‌, మెరైన్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది

Updated Date - 2023-04-29T02:07:16+05:30 IST