నేడు ఉరవకొండలో సాధికార బస్సు యాత్ర | Sakshi
Sakshi News home page

నేడు ఉరవకొండలో సాధికార బస్సు యాత్ర

Published Sun, Jan 7 2024 1:56 AM

ఉరవకొండలో సామాజిక సాధికార బస్సుయాత్ర  సభ జరిగే ప్రదేశం, వజ్రకరూరులో మాట్లాడుతున్న విశ్వ - Sakshi

ఉరవకొండ: వైఎస్సార్‌సీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత దక్కింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి పక్కాగా అమలు చేశారు. మంత్రి వర్గం మొదలుకొని ఎంపీటీసీ పదవుల వరకు అన్నింటిలోనూ పెద్ద పీట వేశారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. ఆయా వర్గాలకు జరిగిన మేలును వివరించేందుకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సుయాత్ర ఆదివారం ఉరవకొండకు చేరుకోనుంది. యాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలు, వైఎస్సార్‌సీపీ జెండాలతో ఆ ప్రాంతం నూతన శోభ సంతరించుకుంది.

సాధికార యాత్ర షెడ్యూల్‌ ఇలా..

సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మధ్యాహ్నం 1 గంటకు ఉరవకొండలోని బళ్లారి బైపాస్‌లో గల సత్యం కన్వెక్షన్‌ హల్‌లో పలువురు సామాజిక సేవకులు, మేధావులు, రిటైర్డు ఉద్యోగులు తదితరులతో మంత్రులు, ప్రజాప్రతినిధుల ముఖాముఖి ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నుంచి బస్సుయాత్ర ప్రారంభమై అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు కొనసాగనుంది. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత పాత బస్టాండ్‌ సర్కిల్‌ వద్ద బహిరంగ సభ ప్రారంభం కానుంది.

ప్రజాప్రతినిధుల రాక

సామాజిక సాధికార బస్సు యాత్రలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రులు విడదల రజిని, ఉషశ్రీచరణ్‌, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్సీ పోతుల సునీత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, నియోజకవర్గ పరిశీలకులు వాసు హాజరుకానున్నారు.

హాజరు కానున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజాప్రతినిధులు

1/1

Advertisement
Advertisement