86,142 మందికి పట్టాలు | Sakshi
Sakshi News home page

86,142 మందికి పట్టాలు

Published Sun, Jan 7 2024 1:54 AM

- - Sakshi

అనంతపురం: జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో 86,142 మంది పట్టాలకు ఆమోద ముద్ర వేశారు. ఇందులో 68,963 మందికి డిగ్రీ, 15,805 మందికి పీజీ పట్టాలు, 1109 మందికి డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ, 265 మందికి పీహెచ్‌డీ అవార్డులు ఉన్నాయి. వేదికపై 265 మందికి పీహెచ్‌డీ అవార్డులు అందించారు. తక్కిన వారికి స్నాతకోత్సవ పట్టాలు నేరుగా అందజేస్తారు.

● 2021–22, 2022–23 విద్యా సంవత్సరాలకు సంబంధించి 71 బంగారు పతకాలు అందించగా.. ఇందులో 43 బంగారు పతకాలు అమ్మాయిలకే దక్కాయి. ఇందులోనూ దాసరి శాంతి అనే విద్యార్థిని ఏకంగా ఎనిమిది బంగారు పతకాలను కై వసం చేసుకోవడం విశేషం.

2021–22 విద్యా సంవత్సరంలో జేఎన్‌టీయూ క్యాంపస్‌

ఇంజినీరింగ్‌ కళాశాలలో బంగారు పతకాలు సాధించిన వారు..

బి. మేఘన (సివిల్‌ ఇంజినీరింగ్‌లో 4 బంగారు పతకాలు), వి.చైతన్య (ఈఈఈలో 2), సీబీ సాయికుమార్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో 5), దాసరి నిర్ణీత (మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 3 బంగారు పతకాలు), కొండా సాయి తనూజ (ఈసీఈలో 2), మేడా గురు సంతోష్‌ కుమార్‌ (సీఎస్‌ఈలో 1), బి.ప్రదీప్‌ కుమార్‌ (ఎంటెక్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో 1), టి.చందన (ఎంటెక్‌ ఎలక్ట్రికల్‌ పవర్‌ సిస్టమ్స్‌లో 1), ఎస్‌.గాయత్రి (ఎంటెక్‌ రిలేబిలిటీ ఇంజినీరింగ్‌లో 1) బంగారు పతకాలు సాధించారు.

● పులివెందుల కళాశాల నుంచి బిజివేముల చంద్ర ప్రకాష్‌రెడ్డి (సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఒకటి), సోమల జగదీశ్వరరెడ్డి (ఈఈఈలో 1), సి.పెంచల లక్ష్మీ సుష్మ (సీఎస్‌ఈలో ఒకటి) బంగారు పతకాలు సాధించారు.

2022–23లో క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో...

దాసరి శాంతి బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 8 బంగారు పతకాలు సాధించింది. ఎం.నిత్య శ్రీ (ఈఈఈ విభాగంలో రెండు), .వంశీ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో మూడు), ఎస్‌.సుమంత్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో రెండు)తో పాటు శ్రీగిరి నవనీశ్వర్‌రెడ్డి (మెకానికల్‌), టీఎం రూపా(ఈసీఈ), ఎం.చిన్న యల్లారెడ్డి (ఈసీఈ), తొల్లేటి శివప్రియ (సీఎస్‌ఈ), పాలగాటి రాజమోహన్‌రెడ్డి (సివిల్‌ ఇంజినీరింగ్‌), సి.గోవర్ధన్‌ (ఈఈఈ), పి.విష్ణుప్రియ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌), పి.సంగీత (ఈసీఈ), ఆర్‌.జయశ్రీ (కంప్యూటర్‌ సైన్స్‌), సి.పుష్పలత (ఎంటెక్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌) ఒక్కో బంగారు పతకం సాధించారు.

1/1

Advertisement
Advertisement