రష్మిక ఫస్ట్ లుక్.. “గుంటూరు కారం” మహేష్ తో వైరల్..!

రష్మిక ఫస్ట్ లుక్.. “గుంటూరు కారం” మహేష్ తో వైరల్..!

Published on Apr 5, 2024 7:59 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ఇప్పుడు తెలుగు సహా పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా ఉండగా ఈరోజు తన బర్త్ డే కానుకగా అయితే తన అవైటెడ్ భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” (Pushpa 2 The Rule) నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే దీనికి మంచి రెస్పాన్స్ వస్తుండగా దీనితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ అంశం వైరల్ గా మారుతుంది ఈ ఫస్ట్ లుక్ చూస్తే రష్మిక తన రెండు వేళ్ళ గ్యాప్ నుంచి ఒక కంటితో చూస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఇది చూసిన వెంటనే రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) “గుంటూరు కారం” (Guntur Kaaram) లో చేసిన చిన్నపాటి మ్యానరిజం గుర్తు రాక మానదు. బీడీ 3డిలో కనపడిందా అంటూ తాను కూడా అలానే చూస్తాడు దీనితో పుష్ప 2 నుంచి రష్మిక పోస్టర్ చూసాక గుంటూరు కారం తో మహేష్ మరోసారి టాపిక్ లోకి వచ్చాడు.

మరి మహేష్ మరియు రష్మిక కాంబినేషన్ లో వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మొత్తానికి మళ్ళీ మరోసారి ఈ కాంబినేషన్ కోసం ఈ రకంగా అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఎడిట్స్ విషయంలో రష్మిక మందన్న కూడా సోషల్ మీడియాలో స్పందించి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు