“గుంటూరు కారం” ట్రైలర్ పై లేటెస్ట్ క్లారిటీ.!

“గుంటూరు కారం” ట్రైలర్ పై లేటెస్ట్ క్లారిటీ.!

Published on Jan 6, 2024 10:00 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హీరోయిన్స్ శ్రీలీల మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రాబోతుండగా భారీ హైప్ ఈ చిత్రం పట్ల నెలకొంది. ఇక ఈ చిత్రం నుంచి అవైటెడ్ గా చూస్తున్న ట్రైలర్ కట్ మరియు గ్రాండ్ ప్రీ రిలీజ్ పట్ల మరింత ఆసక్తి నెలకొనగా మేకర్స్ పలు కారణాలు చేత అయితే సినిమా ప్రీ రిలీజ్ ని వాయిదా వేశారు.

మరి ట్రైలర్ అయినా ఈరోజు వస్తుందా అనే ప్రశ్న స్టార్ట్ కాగా ఇప్పుడు దీనిపై క్లారిటీ తెలుస్తుంది. మేకర్స్ ఈరోజు ట్రైలర్ ని రిలీజ్ చేయడం లేదట. కొత్తగా ఫిక్స్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే దానిని విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ కూడా రానుంది. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు