Asianet News TeluguAsianet News Telugu

జనసేనాని పవన్ కళ్యాణ్ ని డాక్టరేట్ కి ఎంపిక చేసిన వేల్స్ యూనివర్సిటీ, కానీ ట్విస్ట్

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.  పాలిటిక్స్ కారణంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించాల్సిన చాలా సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి.

Janasena Party chief Pawan Kalyan rejects Doctorate from Vels University dtr
Author
First Published Jan 6, 2024, 7:41 AM IST

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.  పాలిటిక్స్ కారణంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించాల్సిన చాలా సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పవన్ పూర్తిగా తన టైంని పార్టీ కోసమే కేటాయిస్తున్నారు. 

రాజకీయాలు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. అనేక వేదికలపై పవన్ వ్యక్తిత్వాన్ని ప్రశంసించిన వారు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి తాజాగా ఒక ఉన్నత గౌరవం దక్కింది. అదేంటంటే.. తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ వారు జనసేనానికి డాక్టరేట్ ప్రధానం చేసేందుకు ఎంపిక చేశారు. 

జనవరిలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ ఈవెంట్ కి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా ఆహ్వానించారు. కానీ జనసేనాని మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వివిధ రంగాలలో రాణించిన గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారని వారికి డాక్టరేట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. తనకు ఇస్తున్న డాక్టరేట్ ని సున్నితంగా తిరస్కరిస్తూ వేల్స్ యూనివర్సిటీకి పవన్ లేఖ రాశారు. 

తనని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ కి ఎంపిక చేయడం సంతోషంగా ఉందని అలాగే గౌరవంగా కూడా భావిస్తానని పవన్ అన్నారు. కానీ తనకంటే చాలా మంది గొప్పవారు ఉన్నారు. వారిలో సరినవారికి ఈ డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా పవన్ కోరారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా యూనివర్సిటీ 14వ కన్వకేషన్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోతున్నట్లు పవన్ లేఖలో పేర్కొన్నారు. 

డాక్టరేట్ అందుకునే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. కానీ పవన్ ఇలా రిజెక్ట్ చేయడం చూసి అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. చెంతకు వచ్చిన డాక్టరేట్ ని కూడా రిజెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదని అది పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios