Tuesday, April 16, 2024

HYD: స్పా సెంట‌ర్‌ల‌పై పోలీసుల దాడులు..

కార్వాన్, జనవరి 6(ప్ర‌భ‌న్యూస్‌): గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమ స్పా సెంటర్ లపై పోలీసులు దాడులు నిర్వ‌హించారు. పక్క సమాచారం మేరకు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు,గుడిమాల్కాపుర్ పోలీసులు సంయుక్తంగా కలిసి నానల్ నగర్ లోని ఉన్న ఓ అపార్ట్ మెంట్‌లో జన్నత్,గోల్డెన్ అనే రెండు స్పా సెంటర్ల పై దాడులు నిర్వ‌హించారు.

క్రాస్ మసాజ్ చేస్తున్న 5 మంది అమ్మాయిలతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న 5 మంది మహిళలు 1 వ్యక్తి తో పాటు స్పా సెంటర్ల యజమానుల పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి స్పా సెంటర్లు ఎక్కడ ఉన్నా ఆ భవన యజమాని వారిని ఖాళీ చేపియలని, లేని పక్షంలో వారి పైన కుడా తగిన చర్యలు తీసుకోవలసి వస్తుందని గుడిమల్కాపుర్ ఇన్స్పెక్టర్ ముజీబ్ రెహ్మాన్ హెచ్చరించారు. యువకులు ఎవ్వరూ కుడా స్పా సెంటర్ లకు గానీ, స్నూకర్ సెంటర్ల కు గాని రెక్రేశన్ క్లబ్ లలో వెళ్లి అనవసరంగా కేసులు చేసుకోకండి అని గుడిమల్కాపూర్ ఇన్స్‌స్పెక్టర్ యువకులతో అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement