‘గుంటూరు కారం’ : ఆకట్టుకుంటున్న మహేష్, త్రివిక్రమ్ ల భారీ కటౌట్స్

‘గుంటూరు కారం’ : ఆకట్టుకుంటున్న మహేష్, త్రివిక్రమ్ ల భారీ కటౌట్స్

Published on Jan 6, 2024 3:05 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం జనవరి 12న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో హీరోయిన్స్ గా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. గుంటూరు కారం రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలు సహా పలు ఇతర ప్రాంతాల్లో కూడా అప్పుడే సూపర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద పోస్టర్స్, బ్యానర్స్, కటౌట్స్ తో హంగామా మొదలుపెట్టేసారు.

విషయం ఏమిటంటే, తాజాగా రాజమండ్రి అప్సర థియేటర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ ల ప్రత్యేక భారీ కటౌట్స్ ప్రస్తుతం ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. కాగా పలువురు వీటిని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసి మరింత వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, సాంగ్స్ తో అందరిలో భారీ హైప్ ఏర్పరిచిన గుంటూరు కారం మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేర అందరినీ ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు