TS Politics: ఇవాళే ‘ప్రజా పాలన’ దరఖాస్తులకు చివరి రోజు

TS Politics: Today is the last day for 'People's Governance' applications
TS Politics: Today is the last day for 'People's Governance' applications

ఇవాళే ‘ప్రజా పాలన’ దరఖాస్తులకు లాస్ట్ డేట్. తెలంగాణలో ప్రజాపాలన సభలు ఇవాల్టితో ముగియనున్నాయి. ఇప్పటివరకు ప్రజాపాలనకు కోటికి పైగా దరఖాస్తులు రాగా…. చివరి రోజు కావడంతో ఇవాళ భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆరు గ్యారంటీల కోసం 93.38 లక్షల దరఖాస్తులు రాగా…. మిగతా అవసరాల కోసం 15.55 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక అటు జూన్‌లో విధుల్లోకి విద్యా వలంటీర్లు రానున్నారని సమాచారం. జూన్ 11 నాటికి విద్యా వలంటీర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

వచ్చే విద్యా సంవత్సరంలో తొలిరోజు నుంచే విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకానికి 6-9 నెలల టైం పట్టే అవకాశం ఉండడంతో వాలంటీర్లతో పాఠాలు చెప్పించనుంది. గతంలో 12,600 మంది విద్యా వలంటీర్లుగా పనిచేయగా, ఈసారి స్కూళ్లలో ఉన్న ఖాళీల ప్రకారం ఎంపిక చేయనున్నారు.