పాపం వర్ష.. ఆ వీడియోతో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొందో..!

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా కొన్ని కొన్ని సార్లు ఊహించని ఇబ్బందులు వస్తూ ఉంటాయి.

By Medi Samrat  Published on  22 Nov 2023 1:28 PM GMT
పాపం వర్ష.. ఆ వీడియోతో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొందో..!

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా కొన్ని కొన్ని సార్లు ఊహించని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అమ్మాయిలకు అయితే మరీనూ!! నటిగా నిరూపించుకోవాలని అనుకుంటూ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ వర్ష డిసౌజాకు అలాంటి ఇబ్బందే ఒకటి ఎదురైంది. ఓ వీడియో ఆమెదే అంటూ కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోపై తాజాగా వర్ష స్పందించింది.. తన ఫేక్ వీడియోను వైరల్ చేస్తున్న వ్యక్తులపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది వర్ష.

వర్ష ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆమె చట్టపరంగా చర్యలు తీసుకోడానికి సిద్ధమయ్యారు. కొన్నివారాలుగా తన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని.. ఈ అంశం తనను శారీరకంగా, మానసికంగా కుంగదీసిందని వర్ష తెలిపింది. ఈ వీడియోకు సంబంధించి తన కుటుంబం కూడా ఆవేదనలో ఉన్నారని తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయవాది ఇచ్చిన సూచనతో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను అప్‌లోడ్ చేసింది వర్ష. ఎవరైనా తన వీడియోను సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపింది. దయచేసి ఫేక్ వీడియోను ఎవరూ సర్క్యులేట్ చేయవద్దని అందరినీ రిక్వెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఉన్న ఆ వీడియోను డిలీట్ చేయాలని కూడా కోరింది. వర్షకు ఇంస్టాగ్రామ్ లో 1.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Next Story