'బకెట్ గంజాయి'.. డెలివరీకి నయా రూట్

by Disha Web Desk 4 |
బకెట్ గంజాయి.. డెలివరీకి నయా రూట్
X

దిశ, రాచకొండ : పుష్ప సినిమాలో పుష్పరాజ్ స్మగ్లింగ్ ఐడియాలు చూసి ప్రేక్షకులు కేరింతలు, చప్పట్లు కొట్టారు. కాని నల్గొండకు చెందిన వెంకట కృష్ణ కాంత్ గత 4 యేండ్లుగా పోలీసు లకు చిక్కకుండా గంజాయిని సరఫరా చేసిన వైనం పోలీసు లను ఆశ్చర్యానికి గురి చేసింది. విచారణలో అతని స్మగ్లింగ్ ఐడియాలు చూసి పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. స్మగ్లింగ్‌లో షాకింగ్ ఐడియాలు.. గంజాయి ఇన్ బుక్స్ - గంజాయిని చిన్న పాకెట్స్ లలో వేసి ప్రెస్ చేస్తాడు.

ఆ తర్వాత వాటిని పుస్తకాల మధ్య పెడతాడు. గంజాయి ఉన్న పుస్తకాల చుట్టు ఇంకా కొన్ని పుస్తకాలను పేరుస్తాడు. ఒక మూట లాగా చేసి తరలిస్తాడు. బకెట్ గంజాయి - మందం ఉన్న ప్లాస్టిక్ బకెట్‌లను తీసుకుంటాడు. వాటిని అంచున కోసి మద్యలో గంజాయి ప్యాకెట్‌లను పెట్టి తరలిస్తాడు. సోఫా గంజాయి - భారీ సోఫాలను తీసుకుంటాడు.

ఆ తర్వాత ప్రెస్ చేసిన గంజాయి పాకెట్స్‌ను అందులో పెట్టి పైన మరో కవర్ కుట్టిస్తాడు. ఇలా వెంకట్ కృష్ణ కాంత్ గంజాయి స్మగ్లింగ్‌కు సరికొత్త ఆలోచనలకు పదును పెట్టి 4 సంవత్సరాలుగా పోలీసులు తనిఖీ చేసిన దొరకకుండా కొన్ని వేల కిలోల గంజాయిని రాజస్థాన్‌కు తరలించినట్లు సైబరాబాద్ ఎస్ ఓ టీ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

వెంకట కృష్ణకాంత్‌ను శుక్రవారం 86 కేజీల గంజాయిని జేసీబీ టైర్‌లో పెట్టి తీసుకువచ్చిన కేసులో జీడిమెట్ల పీఎస్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేవలం వెంకట కృష్ణ కాంత్ డెలివరీకి మాత్రమే ఆలోచించి లక్షలు సంపాదించి చెడు వ్యసానాలకు అలవాటు పడి మొత్తం పోగొట్టుకున్నాడని తెలిసింది.



Next Story