పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

తుపాను నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిన్నటితో పంపిణీ గడువు ముగియగా.. పలువురు వాలంటీర్లు తుపాను సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

By అంజి  Published on  6 Dec 2023 2:11 AM GMT
AP state government, pensions distribution, APnews

పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

మిచౌంగ్‌ తుపాను నేపథ్‌యంలో పెన్షన్ల పంపిణీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిన్నటితో పంపిణీ గడువు ముగియగా.. పలువురు వాలంటీర్లు తుపాను సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దీంతో పెన్షన్ల పంపిణీ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి వరకు పొడిగించింది. కాగా ఈ నెలకు సంబంధించి 65.33 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 64 లక్షల మందికి అందించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ మంగళవారం తీరం దాటింది. అయితే ఈ తుపాను ప్రభావం మాత్రం కొనసాగుతోంది. కోస్తాతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. తుపాను తీరం దాటిన తర్వాత ఉత్తరంగా పయనించి దిశ మార్చుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా తెలంగాణలోని ఖమ్మం, అక్కడ నుంచి ఛత్తీస్‌గఢ్ దిశగా పయనించనుంది. దిశ మార్చుకున్నందున తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తుపాను డిసెంబరు 7 వరకు కొనసాగుతుందని, ఆపై తీవ్ర అల్పపీడనంగా మారి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పౌరుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ సెలవులు ప్రకటించబడ్డాయి. బాధిత జిల్లాలను స్వయంగా సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తానని సీఎం జగన్‌ చెప్పారు.

Next Story