సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

- - Sakshi

హుండీ ఆదాయం లెక్కింపు

ఆకివీడు: స్థానిక పెద్దింటి అమ్మవారి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.1.52,926 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈఓ రంగరాజు తెలిపారు.

కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం (ప్రకాశంచౌక్‌): రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతికూల పరిస్థితులను, ప్రాంతాలను ముందుగా గుర్తించి నివేదిక రూపొందించాలని కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, పోలీసు అధికారులతో ఆమె జిల్లాలో సమస్యత్మక, అతి సమస్యత్మక ప్రాంతాలు, పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూఎన్నికలను నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు రెవెన్యూ, పోలీస్‌ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 2014, 2019 ఎన్నికలనాటి పరిస్థితులను బేరీజు వేసుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో వివిధ కులాలు, రాజకీయ పార్టీల మధ్య తగాదాలు, ప్రాంతాలను గుర్తించడంతో పాటు రౌడీషీట్‌ కేసులు తదితర పోలీస్‌ రికార్డుల్లో ఉన్న కేసులను బైండోవర్‌ చేయాలన్నారు.

యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలి

జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల మార్గదర్శకాలు అనుసరించి బైండోవర్‌ డాక్యుమెంట్లను పకడ్బందీగా సిద్ధం చేసి పొందుపరచాలన్నారు. జిల్లాలోని చెక్‌పోస్టుల్లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేయాలని, మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాలన్నారు. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరగకుండా ఎకై ్సజ్‌ శాఖ పటిష్ట కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆర్డీఓలు, డీఎస్పీలు అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. జేసీ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు, సెబ్‌ ఏఎస్పీ ఏటీవీ రవికుమార్‌, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, ఆర్డీఓలు కె.శ్రీనివాసులురాజు, కె.చెన్నయ్య, ఎం.అచ్యుత అంబరీష్‌, జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఎల్‌.రంగారెడ్డి, డీఎస్పీలు బి.శ్రీనాథ్‌, సి.శరత్‌రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest West Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top