లాట్‌ మొబైల్స్‌లో ఇక ఏసీలూ కొనొచ్చు

ABN , First Publish Date - 2023-05-02T01:51:01+05:30 IST

మల్టీ బ్రాండ్‌ మొబైల్‌ రిటైలింగ్‌ కంపెనీ లాట్‌ మొబైల్స్‌ తాజాగా తమ షోరూమ్‌లలో ఏసీల విక్రయాలు కూడా ప్రారంభించింది.

లాట్‌ మొబైల్స్‌లో ఇక ఏసీలూ కొనొచ్చు

హైదరాబాద్‌: మల్టీ బ్రాండ్‌ మొబైల్‌ రిటైలింగ్‌ కంపెనీ లాట్‌ మొబైల్స్‌ తాజాగా తమ షోరూమ్‌లలో ఏసీల విక్రయాలు కూడా ప్రారంభించింది. వోల్టాస్‌, లాయడ్‌ సహా పలు బ్రాండ్ల ఏసీలు తమ వద్ద అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులకు మరింత చేరువ కావడం కోసం 90 నిముషాల ఉచిత డెలివరీ సేవను కూడా ప్రారంభించింది. దీనికి తోడు ఏసీల కొనుగోలుదార్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ప్రకటించింది. దీని ప్రకారం...

● ప్రతీ ఏసీ కొనుగోలుపై 45 శాతం తగ్గింపు

● 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌

● అతి తక్కువ ఈఎంఐ, నెలకు రూ.1888

● 0 శాతం డౌన్‌ పేమెంట్‌

● 60 శాతం అష్యూర్డ్‌ బై బ్యాక్‌

Updated Date - 2023-05-02T01:51:01+05:30 IST