సర్కారు వారి పాట సినిమాతో హిట్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు గుంటూరు కారం అంటూ వచ్చేస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. గత సినిమాల్లో కంటే భిన్నంగా ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు మహేష్. ఈసినిమా పొంగల్ బరిలో దిగనుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్, పాటలను రిలీజ్ చేస్తుండగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఈసినిమా ట్రైలర్ కోసం. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి.. ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు మరోసారి మహేష్ ఫ్యాన్స్ నిరాశ ఎదురైంది. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. కొన్ని కారణాల వల్ల ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. తొందరలోనే కొత్త డేట్, వెన్యూ కు సంబంధించిన అప్ డేట్ ఇస్తామని తెలిపారు.
Despite our best efforts, due to unforeseen circumstances and issues with security permissions, we will not be conducting the highly awaited #GunturKaaram Pre-release event on 6th January 2024. We sincerely apologize for this announcement 💔
The new date for the event with the…
— Haarika & Hassine Creations (@haarikahassine) January 5, 2024
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: