ఆదిత్యుని సన్నిధిలో గుమ్తిధామ్‌ ఆశ్రమాధిపతులు

రట్టి జీడితోటల్లో సంచరిస్తున్న ఎలుగుబంట్లు   - Sakshi

అరసవల్లి: హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలోని ప్రఖ్యాత గుమ్తిధామ్‌ ఆశ్రమాధిపతి గుమ్తి వాలీమాత, ఉత్తరాధికారి జాగృతిదేవిలు తొలి సారి దక్షిణాది యాత్రల్లో భాగంగా అరసవల్లి ఆదిత్యాలయానికి శనివారం విచ్చేశారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆలయ విశిష్టతను వివరించారు. వాలీమాత, జాగృతిదేవిలు మాట్లాడుతూ హింధూ సనాతన ధర్మం వర్ధిల్లాలని, ఇక్కడి పూజావిధానాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. అనంతరం ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ ఆది త్యుని జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌ శర్మ, షణ్ముఖ శర్మ, ఫణీంద్రశర్మ, నేతేటి హరిప్రసాద్‌ శర్మ తదితరు లు పాల్గొనగా..వన్‌టౌన్‌ ఎస్సై బలివాడ గణేష్‌ బందోబస్తు నిర్వహించారు.

ఎలుగు హల్‌చల్‌

మందస : ఉద్దాన ప్రాంతాన్ని ఎలుగుబంట్లు భయపెడుతున్నాయి. మందస మండలం భేతాళపురం పంచాయతీ రట్టి గ్రామంలో ఎలు గుబంట్లు స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాయి. ఉదయాన్నే జీడితోటలకు, సొంత పనులకు వెళ్తున్న రట్టి ప్రజలకు సమీపంలోని తోటల్లో రెండు ఎలుగుబంట్లు కనిపించాయి. దీంతో భయంతో పరుగులు తీశారు. కొద్దిసేప టి తర్వాత కుక్కలు వెంబడించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

వరి కుప్పలు దగ్ధం

మెళియాపుట్టి: మండలంలోని ఆంపురం పంచాయతీ పెంగువాడలో లంబ సూరయ్యకు చెందిన మూడు ఎకరాల వరికుప్పలు (ఇంకా నూర్చలేదు) విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా దగ్ధమయ్యాయి. శనివారం సాయంత్రం విద్యుత్‌ తీగలు తెగిపడి మంటలు వ్యాపించిన ట్లు గ్రామస్తులు, సర్పంచ్‌ జమ్మయ్య తెలిపా రు. గ్రామస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీనిపై తహశిల్దా ర్‌ సరోజిని స్పందిస్తూ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తామని తెలిపారు.

నేడు ఉత్తరాంధ్ర రైతు సదస్సు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఆదివారం ఉదయం 9 గంటలకు ఉత్తరాంధ్ర రైతు సదస్సు నిర్వహించనున్నట్లు ప్రముఖ విద్యావేత్త, పల్సస్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ అధినేత గేదెల శ్రీనుబాబు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతులకు వ్యవసాయంలో మెలకువలు, అధునాతన వ్యవసాయంపై దృష్టి పెట్టేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రైతు కుటుంబాల నిరుద్యోగ యువతకు మరిన్ని ఉపాధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ సదస్సుకి జిల్లాలో రైతులంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు.

లింగ వివక్షలేని సమాజం లక్ష్యం

ఎచ్చెర్ల క్యాంపస్‌: లింగ వివక్ష లేని సమాజం లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం లింగ వివక్ష, యాంటీ ర్యాగింగ్‌ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితం విలువ తెలుసుకుని ముందుకు సాగాన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యండ శ్రీనివాసరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

క్యాలెండర్‌ ఆవిష్కరణ

శ్రీకాకుళం క్రైమ్‌ : అరసవిల్లి స్టేట్‌బ్యాంకు శాఖలో ఎస్‌బీఐ స్టాఫ్‌ యూనియన్‌ క్యాలెండర్‌ను రీజియన్‌ సెక్రటరీ వెంకటరమణ శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో లోకల్‌ సెక్రటరీలు క్రాంతి, రమేష్‌, నాయుడు, ప్రదీప్‌, శ్రీనివాస్‌, సంతోష్‌, రాజు, వసంత, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top