పెరిగిన వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు

ABN , First Publish Date - 2023-04-26T00:14:23+05:30 IST

స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) వాటా క్రమం గా పెరుగుతోంది.

పెరిగిన వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు

న్యూఢిల్లీ: స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) వాటా క్రమం గా పెరుగుతోంది. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2014-15 నాటికి జీడీపీలో 2.11 శాతం గా ఉన్న ఈ పన్ను వాటా 2021-22 నాటికి 2.94 శాతానికి చేరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సమావేశంలో ఆమె ఈ విషయం వెల్లడించారు. ఇదే సమయంలో సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ టాక్స్‌ (ఎస్‌టీటీ)తో కలుపుకుని వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ.2.65 లక్షల కోట్ల నుంచి రూ.6.96 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు.

Updated Date - 2023-04-26T00:14:23+05:30 IST