● డిప్లమో విద్యార్థుల ప్రయోగాలకు పెద్దపీట ● శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రూ.1.20 కోట్లతో ల్యాబ్‌లు ● అధునాతన పారిశ్రామిక అవసరాలపై శిక్షణ

హైడ్రాలిక్స్‌ ల్యాబ్‌లో విద్యార్థుల ప్రయోగాలు  - Sakshi

నైపుణ్యాలకు ప్రాధాన్యం..

డిప్లమా పూర్తయ్యాక విద్యా ర్థులు ఉద్యోగాలకు, ఉన్నత విద్యకు ప్రాధాన్యమిస్తున్నా రు. సాంకేతిక విద్యాశాఖ లక్ష్యం మాత్రం రిలీవ్‌ అయి న విద్యార్థి ఉద్యోగంలో చేరటం. అందుకే పక్కా గా ప్రయోగాలకు, ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యమిస్తున్నాం. ప్రస్తుతం స్కిల్డ్‌ వర్కర్స్‌ను మాత్రమే పరిశ్రమలు తీసుకుంటున్నాయి. అందుకుఅవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు కల్పిస్తున్నాం.

– చదలవాడ నాగరాణి,

రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్‌

ఎచ్చెర్ల క్యాంపస్‌: పేద, మధ్య తరగతి విద్యార్థులు ప్రవేశాలు పొందే పాలిటెక్నిక్‌ డిప్లమా కోర్సును సాంకేతిక విద్యాశాఖ పారిశ్రామిక అవసరాలను అనుగుణంగా మార్పులు చేసింది. రాష్ట్రంలో ఉత్తమ విద్య అందించే పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఒకటైన శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. రూ.1.20 కోట్ల వ్యయంతో ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దృష్టి లో పెట్టుకుని ఈ ల్యాబ్‌లకు రూపకల్పన చేసింది. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఐదు డిప్లమా బ్రాంచ్‌లు ఉన్నాయి. సివిల్‌, ట్రిపుల్‌ఈ, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, నాన్‌ ఇంజినీరింగ్‌లో కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 330 సీట్లు అందుబాటులో ఉన్నా యి. పాలిటెక్నిక్‌ ప్రవేశాల్లో ఈ కళాశాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులు ఈ కాలేజీకే ప్రాధాన్యమిస్తారు. ఏటా 300 మంది విద్యార్థులు వరకు రిలీవ్‌ అవుతుండగా, మూడేళ్లలో 900 మంది వరకు విద్యార్థులు చదువు తున్నారు. హైడ్రాలిక్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సర్వే, కంప్యూటర్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్‌, లాగ్వేజ్‌ వంటి ల్యాబ్‌లు అధునాతనంగా తీర్చిదిద్దారు.

విషయ పరిజ్ఞానం..

ఉదయం క్లాస్‌ వర్కు అయ్యాక, ప్రయోగ విద్య కోసం ఎదురు చూస్తాం. ప్రాక్టికల్స్‌ పట్ల అధిక ఆసక్తి ఉంటుంది. ఒత్తిడి ఉండదు. బ్రాంచి సబ్జెక్టుకు సంబంధించి అన్ని అంశాలను అధునాతన ల్యాబ్‌లో ప్రాక్టికల్‌గా తెలుసుకుంటున్నాం. మరోవైపు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ల్యాబ్‌లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అంశాలు తెలుసు కుంటున్నాం.

– బి.గాయత్రి, డిప్లమా రెండో ఏడాది విద్యార్థిని

పరిశ్రమలకు అనుగుణంగా..

ప్రస్తుతం విద్యలో నైపుణ్యా లకు ప్రాధాన్యం పెరిగింది. స్కిల్స్‌ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయి. క్యాంపస్‌ డ్రైవ్‌ లు, పరిశ్రమలు ఇంటర్వ్యూలకు సన్నద్ధం చేయటంలో ల్యాబ్‌ల పాత్ర కీలకం. సబ్జెక్టుపై పట్టుతో పాటు ల్యాబ్‌లో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్‌ శిక్షణ ఎంతగానో ఉనయోగపడుతుంది.

– జి.కిరణ్మయి, డిప్లమా రెండో ఏడాది విద్యార్థిని

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top