పురుగుల మందు తాగి యువతి మృతి

- - Sakshi

నందిగాం: మండంలోని కొత్తగ్రహారం పంచాయ తీ జడ్యాడకు చెందిన తరిణి లలిత(23) పురుగుల మందు తాగి మృతి చెందింది. నందిగాం పోలీసు లు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్యాడకు చెందిన వ్యవసాయ కూలీలు తరిని వైకుంఠరావు, నాగమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా చిన్న కుమార్తె లలిత. ఈమెకు ఫిట్స్‌తో బాధపడుతోంది. వ్యాధి తీవ్రత పెరగడంతో బాధ తట్టుకోలేక శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి వషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తరలించారు.

బైక్‌ చోరీ

కాశీబుగ్గ: మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌–2లో ఓ ఇంటి వద్ద బులెట్‌ బైక్‌ చోరీకి గురైంది. గాంధీనగర్‌కు చెందిన శ్రీధర్‌ అనే సెల్‌ఫోన్‌ వ్యాపారి తెలుపు రంగు బులెట్‌ వాహనాన్ని తన ఇంటి వద్ద హ్యాండిల్‌ లాక్‌వేసి ఉంచారు. శనివారం వేకువజామున ఓ యువకుడు వచ్చి తాళం పెకిలి వాహనాన్ని స్టార్ట్‌ చేయకుండా నడిపించుకుంటూ పరారయ్యాడు. ఈ సన్నివేశం సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో బాధితుడు కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఇదే వీధిలో రమేష్‌ అనే వ్యక్తికి చెందిన పల్సర్‌ బైకు సైతం నెలరోజుల కిందట చోరీకి గురైంది. సీసీ ఫుటేజీలో దృశ్యం కనిపించినప్పటికీ పోలీసులు పట్టుకోలేకపోయారు. వరుసగా బైకు దొంగతనాలు జరుగుతున్నాయని, తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు సీఐ నవీన్‌కుమార్‌కు విన్నవించారు.

మద్యం బాటిళ్ల పట్టివేత

టెక్కలి రూరల్‌: స్థానిక పాత జాతీయ రహదారిలో సుదర్శన్‌ జంక్షన్‌ సమీపంలో పాన్‌ షాపులో అక్రమ మద్యం అమ్ముతున్నారనే సమాచారం మేర కు టెక్కలి ఎస్‌ఐ–2 రమేష్‌బాబు శనివారం తనిఖీలు నిర్వహించారు. జి. నాగరాజు అనే వ్యక్తికి సంబంధించి పాన్‌షాపులో 17 మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ–2 తెలిపారు.

‘ఆదిత్య’లో షూటింగ్‌ సందడి

టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. గజవిల్లి భానుమతి నిర్మాతగా తెరకెక్కనున్న ప్రొడక్షన్‌ నెంబర్‌–1 ‘మాతృదేవోభవ’ సినిమా షూటింగ్‌ను టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, కళాశాల డైరెక్టర్‌ వి.వి.నాగేశ్వరరావు ప్రారంభించారు. దుర్గా కై లాస్‌ ఈ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్సు, ఫైట్స్‌, పాటలను జిల్లాకు చెందిన యువకులే కంపోజ్‌ చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top