విజయఢంకా మోగిస్తాం

- - Sakshi

అనంతపురం కార్పొరేషన్‌: రానున్న ఎన్నికల్లో మరోసారి విజయఢంకా మోగిస్తామని అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్తగా అవకాశమిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ జగనన్నకు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మంచి పేరు తీసుకువస్తానన్నారు. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలు గెలవాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమని, ఆ దిశగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులందరూ పని చేస్తామన్నారు. అనంతపురం నియోజకవర్గంతో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలుపునకు చిత్తశుద్ధితో పని చేస్తామన్నారు. వైఎస్సార్‌ సీపీ స్థాపించిన తర్వాత నుంచి 2019 వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పని చేయడంతో ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలున్నాయని, వారందరినీ కలుపుకుని ముందుకెళ్తానని తెలిపారు

బస్సు యాత్ర విజయవంతం చేద్దాం

ఉరవకొండలో ఆదివారం జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శంకరనారాయణ పిలుపునిచ్చారు. సామాజిక సాధికార బస్సు యాత్రలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మేలు చేసిన ఏకై క ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బడుగులకు రాజ్యాధికారం కల్పించారన్నారు. అనంతపురం పార్లమెంటు సమన్వయకర్తగా మాలగుండ్ల శంకర నారాయణ, కళ్యాణదుర్గం అసెంబ్లీ సమన్వయకర్తగా తలారి రంగయ్యకు అవకాశం కల్పించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా సీట్ల కేటాయింపు జరుగుతోందని, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయమే తమకు శిరోధార్యమని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే శంకరనారాయణను పైలా నరసింహయ్య, నగర మేయర్‌ వసీం తదితరులు పుష్పగుచ్ఛం, శాలువాతో ఘనంగా సన్మానించారు. అభినందనలు తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీం అహ్మద్‌, రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ మీసాల రంగన్న, టీటీడీ బోర్డు సభ్యులు అశ్వర్థ నాయక్‌, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్‌, కార్పొరేటర్‌ కమల్‌భూషణ్‌, నాయకులు జావెద్‌, పార్టీ నాయకులు చిట్రా వెంకటేష్‌, రాళ్ల తిమ్మారెడ్డి, పెన్నోబులేసు,పామిడి వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

175 స్థానాల్లోనూ విజయం మాదే

అనంతపురం పార్లమెంట్‌

సమన్వయకర్త, ఎమ్మెల్యే శంకర నారాయణ

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top