స్టాక్‌ ఆధారిత విధానం బెటర్‌..

ABN , First Publish Date - 2023-05-08T02:48:07+05:30 IST

ఈ వారం దేశీయ ఈక్విటీ మార్కెట్ల గమనాన్ని కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలతో పాటు అంతర్జాతీయ ట్రెండ్స్‌ నిర్దేశించే వీలుంది. గత వారం ప్రారంభంలో మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ...

స్టాక్‌ ఆధారిత విధానం బెటర్‌..

ఈ వారం దేశీయ ఈక్విటీ మార్కెట్ల గమనాన్ని కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలతో పాటు అంతర్జాతీయ ట్రెండ్స్‌ నిర్దేశించే వీలుంది. గత వారం ప్రారంభంలో మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత దాన్ని కొనసాగించలేకపోయాయి. నిఫ్టీ 18,200 పాయింట్ల వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కొంటోంది. గత వారం బ్యాంక్‌ నిఫ్టీ, ఫిన్‌నిఫ్టీ దాదాపు 2 శాతం వరకు పతనమయ్యాయి. వీక్లీ చార్టుల ప్రకారం చేస్తే నిఫ్టీలో ‘డోజీ’, బ్యాంక్‌ నిఫ్టీలో ‘డార్క్‌ క్లౌడ్‌ కవర్‌’ ఫార్మేషన్‌ కనిపిస్తోంది. ఇది ప్రస్తుత ట్రెండ్‌ను నిలువరించటం లేదా రివర్సల్‌ను సూచిస్తుంది. అయితే ఈ వారం మరింత లాభాల స్వీకరణకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే మాత్రం బ్యాంకింగ్‌ షేర్లు మరింత పతనమయ్యే అవకాశం ఉంది. ఈ వారం నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తే 18,000-17,900 కీలక మద్దతు స్థాయిలుగా ఉండనున్నాయి. అప్‌ట్రెండ్‌ను కనబరిస్తే మాత్రం 18,150-18,250 వద్ద నిరోధ స్థాయిలుంటాయి. ట్రేడర్లు ఈ వారం స్టాక్‌ ఆధారిత వ్యూహంతో పాటు లాంగ్‌ పొజిషన్ల కోసం పడితే కొనుగోలు వ్యూహాన్ని అమలు పరచటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

ఎన్‌ఓసీఎల్‌: గత ఏడాది సెప్టెంబరులో ఈ షేరు రూ.290 మార్కును తాకిన నాటి నుంచి కరెక్షన్‌కు గురవుతూ వస్తోంది. ఒక దశలో రూ.200 స్థాయికి కూడా పడిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి నిలకడగా సాగుతూ అప్‌ట్రెండ్‌లోకి అడుగుపెట్టింది. గత వారం నిరోధ స్థాయిలైన రూ.220ని అధిగమించటం ద్వారా బ్రేకౌట్‌ను సాధించింది. గత శుక్రవారం రూ.232.20 వద్ద క్లోజైన ఈ షేరు ను రూ.250 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.222 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

హిటాచీ ఎనర్జీ ఇండియా: ఈ షేరు గత ఆరేడు నెలలుగా రూ.3,000 స్థాయిలో కదలాడుతూ వచ్చింది. ఈ మధ్యనే ఈ షేరులో వాల్యూమ్స్‌ అనూహ్యంగా పెరిగిపోవటంతో పాటు ధర కూడా నిలకడగా వృద్ధి చెందుతూ వస్తోంది. గత శుక్రవారం ఈ షేరు అన్ని రకాలైన ఆటంకాలను అధిగమిస్తూ కొత్త ర్యాలీలోకి ప్రవేశించింది. అయితే ఈ షేరులో రిస్క్‌, రివార్డు రెండూ కనిపిస్తున్నాయి. గత శుక్రవారం రూ.3,729.80 వద్ద క్లోజైన ఈ షేరు.. రూ.3,700-3,660 స్థాయికి పడినప్పుడు స్వల్పకాలానికి రూ.4,100 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.3,440 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలిస్ట్‌, టెక్నికల్‌,

డెరివేటివ్స్‌, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - 2023-05-08T02:48:07+05:30 IST