Friday, April 26, 2024

Minister: ప్ర‌జావాణిని ఆషామాషీగా తీసుకోవ‌ద్దు… అధికారుల‌కు మంత్రి కోమ‌టిరెడ్డి వార్నింగ్

గత ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలనను ప్రజలకు దగ్గర చేస్తున్నామన్నారు. ఇక, ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులు ఆషామాషీగా తీసుకోవద్ద‌ని, ప్రజావాణిలో వచ్చే వినతి పత్రాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. న‌ల్గొండ‌లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం, మంత్రులు, జిల్లా కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు.

వికలాంగులు, మరుగుజ్జులకు పలు ఉద్యోగ అవకాశాలు, యూనివర్సిటీల్లో అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో 20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. నల్లగొండలో జర్నలిస్టుల సంఘానికి 10 ఎకరాల స్థలం కేటాయించి ఇస్తున్నామన్నారు. ఇంకా సరిపోకపోతే ఐదు ఎకరాల స్థలం ఇస్తామని తెలిపారు. ఆరు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుందని మంత్రి అన్నారు.

త్వరలోని బీఆర్ఎస్ ప్రభుత్వం బండారం బయటపెడతామని అన్నారు. ధరణితో వేల ఎకరాల భూమిని లాక్కున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి కావాలంటే గతంలో ఎమ్మెల్యే సంతకం తప్పనిసరిగా కావాల్సి ఉండేదని, కానీ నేడు అలా లేకుండా ఎమ్మెల్యే సంతకం కూడా అవకాశం లేకుండా అధికారుల చేతుల్లోనే పెట్టేటట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్షా 70 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం పేరు మీద కాంట్రాక్టర్ల పాలు చేశారన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పై విజిలెన్స్ విచారణ జరుగుతుంద‌ని వెల్ల‌డించారు.

- Advertisement -

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు వివాదాస్పదం కావడానికి కేసీఆర్ కారణమని మంత్రి మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్ట్ ల విషయంలో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని ధ్వ‌జ‌మెత్తారు. ఎస్ఎల్బిసి సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఎస్టీమేషన్ భారీగా పెరిగిందంటూ, రాబోయే ఐదేళ్లలో ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామ‌ని చెప్పారు. ప్రజాధనాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement