రోడ్డెక్కిన మధ్యాహ్న భోజన కార్మికులు

by Disha Web Desk 15 |
రోడ్డెక్కిన మధ్యాహ్న భోజన కార్మికులు
X

దిశ, ఎల్లారెడ్డి : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్న భోజనం వంట కార్మికులు ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని తహసీల్దార్​ కార్యాలయం ఎదురుగా గల తెలంగాణ ప్రాంగణ ఆవరణలో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ లో భాగంగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మికుల, రైతుల, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని మధ్యాహ్న భోజన వంట కార్మికులు సమ్మె చేపట్టారు.

ఈ సందర్భంగా కార్మికురాలు సోఫియా మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు చెల్లించాల్సిన బకాయి బిల్లులు, వేతనాలను వెంటనే మంజూరు చేయాలని, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఒక విద్యార్థికి 25 రూపాయల స్లాట్ రేట్ ఇవ్వాలని, నిత్యావసర సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని, వంట షెడ్లు, వంట సామాగ్రి మౌలిక సదుపాయాలు కల్పించాలని, కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా పథకం కల్పించాలని,

వేతనాలు పెంచి ప్రతి నెలా 5 తారీఖులోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించని ఎడల ఆందోళనను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు సంగీత, సాయిలు, సల్మా బేగం, బాలమణి, సువర్ణ, మహేందర్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed